ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 02:07:55

ధూప దీప నైవేద్యం విస్తరణ

ధూప దీప నైవేద్యం విస్తరణ
  • దేవాదాయశాఖకు రూ.550 కోట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఆయా దేవాలయాల అభివృద్ధికి 2020-21 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు దేవాలయాలను ఆధునీకరించనున్నారు. మరోవైపు దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యపథకాన్ని యథాతథంగా కొనసాగించనున్నారు. ప్రస్తుతం 3,654 దేవాలయాలకు ఇప్పటివరకు ధీప, దూప నైవేద్య పథకం అమలు చేస్తుండగా.. మరో 1200 దేవాలయాలకు దీనిని విస్తరించనున్నారు. ఇప్పటివరకు 3,654 దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు రూ.27 కోట్లు ఖర్చు చేస్తుండగా.. ఆ అర్హత ఉన్న అన్ని దేవాలయాలకు దీనిని వర్తింపజేసేందుకు ప్రభు త్వం సిద్ధమయింది. ఇందులోభాగంగా ఏడాదికి రూ.50 కోట్లు కేటాయించారు. దీంతో కలిపి దేవాదాయశాఖకు ఈ బడ్జెట్‌లో మొత్తం రూ.550 కోట్లు కేటాయింపులు చేశారు.


logo