గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:14:39

రవాణాకు రాచబాట

రవాణాకు రాచబాట
  • రవాణా, రోడ్లు భవనాల శాఖకు రూ.3,494 కోట్లు
  • గత బడ్జెట్‌కన్నా రెండువేల కోట్లకుపైగా పెంపు

రవాణా, రోడ్లు భవనాలశాఖకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో రూ.3,494 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన (రూ.1,411 కోట్లు) మొత్తం కంటే రూ.2,000 కోట్లకు పైగా పెంచింది. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అమలుచేస్తున్నది. రహదారుల నిర్మాణం, నిర్వహణకు రూ.750 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే చాలా జిల్లాల్లో నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్నిచోట్ల చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే ఈ నిర్మాణాలన్నీ పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలను ఈ ఏడాదిలో పూర్తిచేయడానికి బడ్జెట్‌లో రూ.550 కోట్లు ప్రతిపాదించారు. 


logo