బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 00:56:24

రూ. 31 లక్షల నకిలీ విత్తనాలు

రూ. 31 లక్షల నకిలీ విత్తనాలు

  • మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో స్వాధీనం 

మేడ్చల్‌ రూరల్‌/ఊట్కూర్‌: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గోదాంలపై దాడులు జరిపి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు. మేడ్చల్‌ జిల్లా, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఈకో ఆగ్రో సీడ్స్‌ గోదాంపై విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడిచేశారు. గోదాంలోని రూ.31 లక్షల విలువైన నకిలీ మక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను జప్తుచేశారు. విత్తన ప్యాకెట్లపై పరీక్షించిన తేదీ, ప్యాకింగ్‌ చేసిన తేదీలో తేడా ఉండటం గుర్తించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ రాజు మాట్లాడుతూ సరైన పరీక్షలు నిర్వహించకుండానే విత్తనాలను విక్రయించడానికి సిద్ధంచేశారని చెప్పారు. 

రూ.57వేల పత్తి విత్తనాలు స్వాధీనం

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం తిప్రాస్‌పల్లిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ ఇంటిపై దాడిచేసి రూ.57,660 విలువగల 62 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నారు. శ్రీనివాసులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు సమాచారంతో దాడిచేశామని ఎస్‌ఐ రషీద్‌ తెలిపారు. 


logo