బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 03:05:50

బలహీనవర్గాలకు భరోసా

బలహీనవర్గాలకు భరోసా
 • బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రగతికి : రూ.30,663 కోట్లు
 • ఎంబీసీ కార్పొరేషన్‌కు : రూ. 500 కోట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2020-21 వార్షిక బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ.30,663.06 కోట్లు కేటాయించారు. ఇందులో కల్యాణలక్ష్మి పథకానికి రూ.2,240 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమం, విద్యాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అంశాలకు  ఐదేండ్లుగా (2019-20 ఆర్థిక సంవత్సరం ఆరునెలల బడ్జెట్‌తోపాటు) కేటాయించిన బడ్జెట్‌, 2020-21 సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్‌ వివరాలు.. 


2020-21 వార్షిక బడ్జెట్లో సంక్షేమశాఖలకు కేటాయించిన బడ్జెట్లో ప్రధానాంశాలు

 • ఎస్సీల అభివృద్ధి నిధి కోసం రూ.16,534.97 కోట్లు
 • ఎస్టీల అభివృద్ధి నిధి కోసం రూ.9,771.27 కోట్లు 
 • బీసీల సంక్షేమానికి రూ.4,356.82 కోట్లు 
 • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూ.2,650కోట్లు
 • కల్యాణలక్ష్మి పథకానికి రూ.2,240కోట్లు
 • ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500కోట్లు
 • ఎస్సీ అభివృద్ధిశాఖకు రూ.2,610.19కోట్లు
 • గిరిజన సంక్షేమశాఖ రూ.2,286కోట్లు
 • ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్‌ కోసం రూ.338కోట్లు 


logo
>>>>>>