గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 10:51:59

కోటిలింగాలకు అభివృద్ధికి రూ.3 కోట్లు

కోటిలింగాలకు అభివృద్ధికి రూ.3 కోట్లు

వెల్గటూర్‌: రాష్ట్రంలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాంతంగా గుర్తింపు పొందిన వెల్గటూర్‌ మండలం కోటిలింగాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటున్నది. ఇంతకుముందు పుష్కరఘాట్లు నిర్మించి, వివిధ సౌకర్యాలు కల్పించి, ఇక్కడ గోదావరిలో రూ.2కోట్లతో బోటింగ్‌ను సైతం ప్రారంభించిన సర్కారు, తాజాగా మరిన్ని అభివృద్ధి పనులకు రూ.3కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.

కోటిలింగాలలో హరితహోటల్‌ నిర్మాణం, జింకల పార్కు, మ్యూజియం, సెంట్రల్‌ లైటింగ్‌ తదితరాల కోసం గతంలోనే ప్రతిపాదనలు పంపగా ఆ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇవి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకోనున్నది. పుష్కరాల సమయంలో ఆలయం చుట్టూ సీసీరోడ్ల నిర్మాణం, వెల్గటూరు నుంచి కోటిలింగాల దాకా మూడున్నర కిలోమీటర్ల వరకు తారురోడ్డు, వెల్గటూరు- కోటిలింగాల మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేశారు. కోటిలింగాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో స్థానికులు, పర్యాటకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. 


logo
>>>>>>