గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 07:09:40

ఖ‌మ్మంలో ఘ‌రానా మోసం.. రూ.3.5 కోట్లు ముంచిన కుటుంబం

ఖ‌మ్మంలో ఘ‌రానా మోసం.. రూ.3.5 కోట్లు ముంచిన కుటుంబం

హైద‌రాబాద్‌: ఖమ్మం జిల్లాలో అక్రమ వ్యాపా‌రం‌చేసి నమ్మి‌న‌వా‌రిని నట్టే‌ట‌ముం‌చింది ఓ కుటుంబం. జనా‌నికి సుమారు రూ.3.50 కోట్లకు ఎగ‌నామం పెట్టిన కుటుం‌బంలో ఇద్ద‌రిని పోలీ‌సులు అరె‌స్టు‌చే‌శారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విజ‌య‌వా‌డ‌లోని భవా‌నీ‌న‌గ‌ర్‌కు చెందిన పురాణం శివ‌కు‌మారి అనే మహిళ తన ముగ్గురు కుమా‌రు‌లతో కలిసి ఖమ్మం జిల్లా‌లోని కొన్ని సంస్థ‌లకు నిత్యా‌వ‌సర సరు‌కులు సర‌ఫరా చేస్తు‌న్న‌ట్టుగా చెప్పు‌కు‌నేది. రూ.కోట్లలో పెసలు, కంది‌పప్పు, బియ్యం‌తో‌పాటు అనేక రకాల వస్తు‌వులు తీసు‌కు‌నేది. రూ.4 వడ్డీ ఇస్తా‌నని అందిన కాడికి డబ్బు తీసు‌కుంది. 

వ్యాపా‌రు‌లను నమ్మిం‌చేం‌దుకు ముందుగా కొంత‌డబ్బు చెల్లిం‌చేది. తర్వాత ఇచ్చిన డబ్బు తిరి‌గి‌రా‌క‌పో‌వ‌డంతో మోస‌పో‌యా‌మని గుర్తిం‌చిన బాధి‌తులు ఆమెను విచా‌రిం‌చగా ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా అని కాలం వెల్ల‌బు‌చ్చేది. విసు‌గు‌చెం‌దిన ఖమ్మం రూరల్‌ మండలం సత్య‌నా‌రా‌య‌ణ‌పు‌రం‌లోని రాఘ‌వేం‌ద్ర‌న‌గ‌ర్‌కు చెందిన మాలోతు సునీత రూ.70 లక్షలు ఇచ్చి మోస‌పో‌యి‌నట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీ‌సు‌లు విచా‌రణ చేప‌ట్టారు. నింది‌తు‌రాలి కుమా‌రు‌లైన ఏ2 నింది‌తుడు పురాణం శివ, ఏ3 నింది‌తుడు పురాణం శంక‌ర్‌ను నిన్న‌ అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1 నింది‌తు‌రాలు పురాణం శివ‌కు‌మారి, ఏ4 నింది‌తుడు పురాణం గోపి‌కృష్ణ పరా‌రీలో ఉన్నారు. వీరిపై రూ.3.54 కోట్లకు ఖమ్మం 1టౌన్‌, 3టౌన్‌, కూసు‌మంచి, రఘు‌నా‌థ‌పాలెం, ఖమ్మం రూరల్‌ పోలీ‌స్‌‌స్టే‌షన్‌ పరి‌ధిలో ఏడు చీటింగ్‌ కేసులు నమో‌ద‌య్యాయి. పరా‌రీలో ఉన్న నింది‌తు‌లను త్వర‌లోనే అరెస్టు చేస్తా‌మని సీఐ పేర్కొ‌న్నారు.


logo