శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 11:41:25

ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే రూ.20 వేలు సబ్సిడీ: మంత్రి నిరంజన్‌ రెడ్డి

ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే రూ.20 వేలు సబ్సిడీ: మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : హరితహారంలో భాగంగా ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటితే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలు ప్రశ్నలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ...23 జిల్లాల్లో  ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలత ఉందని నిపుణులు చెప్పారు. మొత్తలం 2.73 లక్షల ఎకరాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాం. ఎక్కడ ఏపంటలకు అనుకూలం, ఏ పంటలు లాభదాయకం అనేది ప్రజలకు తెలిపే బాధ్యత ప్రభుత్వానిదని, ఏ పంటల వేయాలన్నది రైతుల ఇష్టమని తెలిపారు.

కేంద్రం నుంచి రెండు నిపుణుల బృందాలు వచ్చి ఆయిల్‌పామ్‌కు అనుకూలమని తేల్చి చెప్పారని మంత్రి నిరంజన్ తెలిపారు.  ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే ఎకరానికి రూ.20 వేలు సబ్సిడీ ఇస్తాం. ఆయిల్‌పామ్‌ 4 ఏళ్లకు పంట వస్తుంది, అప్పటివరకు అంతర పంటలు వేసుకోవచ్చు. రాష్ట్రంలో 18,100 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగుకు కేంద్రం అనుమతించింది. దేశంలో 21 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నూనె వాడుతుంటే కేవలం 7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఉపాధిహామిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోలేదని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. 


logo