శనివారం 06 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:30

రూ.2కే యూనిట్‌ విద్యుత్‌

రూ.2కే యూనిట్‌ విద్యుత్‌

  • పర్యావరణహిత టెక్నాలజీతో ఉత్పత్త్తి
  • హైదరాబాదీ అద్భుత ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మనిషి నిత్యజీవితంలో విద్యుత్‌ నేడు విడదీయలేని భాగం. థర్మల్‌, హైడల్‌, టైడల్‌, సోలార్‌, విండ్‌, న్యూక్లియర్‌, గ్యాస్‌.. విధా నం ఏదైనా విద్యుత్‌ మనకు నిత్యావసరం. భారీ విద్యుత్‌ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే స్థాయి నుంచి ఇప్పుడు ఇండ్లపైన, పెరట్లో కూడా ఉత్పత్తి చేసే విధానాలు వచ్చాయి. అలాంటి ఓ నూతన విధానాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ శ్రీనివాస భాస్కర్‌ చాగంటి. తాను రూపొందించిన ‘కమ్మ గేర్‌ ైప్లెవీల్‌ పవర్‌ జనరేషన్‌ ప్రాజెక్ట్‌' ద్వారా యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2కే అందివ్వగలనని అంటున్నారు. 

చక్రంతో విద్యుత్‌.. 

కైనటిక్‌ అసొసియేటెడ్‌ మాస్‌ మెకానికల్‌ అప్లయెన్సెస్‌ను సూక్ష్మంగా ‘కమ్మ’ అని పిలుస్తున్నారు. ఈ విధానంలో భారీ చక్రాన్ని తిప్పుతారు. అందువల్ల దీనిని కమ్మ ైప్లెవీల్‌ టెక్నాలజీగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పదిశా తం విద్యుత్‌ను వాడి 90శాతం అధి క విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం బ్యాటరీలు, ఒక డీసీ మెటార్‌, ఒక ఏసీ మెటార్‌, ైప్లెవీల్‌, హైస్పీడ్‌ గేర్‌బాక్స్‌, జనరేటర్‌, షాప్ట్‌ మాత్రమే అవసరమవుతాయి. బ్యా టరీల నుంచి 840 వోల్టుల విద్యుత్‌ను డీసీ కంట్రోల్‌కు పంపించి 700 డీసీ మోటార్‌ను నడిపిస్తారు. దాని సాయంతో హైస్పీడ్‌ గేర్‌బాక్స్‌ ద్వారా ైప్లెవీల్‌ను తిప్పి 440 వోల్టుల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

ఇందులో ైప్లెవీల్‌ వ్యాసం ఎంత పెరిగితే విద్యుత్‌ ఉత్పత్తి కూడా అంతేస్థాయిలో పెరుగుతుంది. 160 మీటర్ల వ్యాసం గల ైప్లెవీల్‌ ఒక నిమిషంలో 400 రౌండ్ల పాటు తిరుగుతుం ది. ఇలా తిరగడం మొదలు కాగానే బ్యాటరీలతో తిప్పాల్సిన పనిలేకుండా దానికదే తిరుగుతుంది. ైప్లెవీల్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ప్రాజెక్టుకోసం తాను 1990 నుంచి కష్టపడుతున్నానని శ్రీనివాస భాస్క ర్‌ తెలిపారు. ఆయన ప్రస్తుతం చర్లపల్లిలో ఓ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తున్నారు. తన ఆవిష్కరణను కేంద్రం గుర్తించిందని, రాష్ట్రప్రభు త్వం గుర్తించి ప్రోత్సహిస్తే పర్యావరణానికి నష్టంలేకుండా భారీమొత్తంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలనని అంటున్నారు. 

30మీటర్ల వ్యాసం 300 టన్నుల బరువున్న  ైప్లెవీల్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ మొత్తం ఇలా..

రౌండ్లు 
ఉత్పత్తి (కిలోవాట్లల్లో)
600
3,707
1000
10,298
1500
23,172
2000 
41,194   


logo