సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 13:34:21

మంత్రి కేటీఆర్‌కు రూ.2 లక్షల చెక్కు అందజేత

మంత్రి కేటీఆర్‌కు రూ.2 లక్షల చెక్కు అందజేత

హైదరాబాద్‌ :  కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు పలువురు వ్యక్తులు, సంస్థలు, దాతలు తమ వంతు చేయూతను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ మందడి లక్ష్మీనరసింహారెడ్డి రూ. 2 లక్షల విరాళం అందించారు. ఈ చెక్కుని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. నగరంలోని  మాసబ్‌ట్యాంక్‌లో గల మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయంలో కేటీఆర్‌ను కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెక్కును అందించారు.


logo