బుధవారం 27 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 17:55:48

రోడ్డు విస్తరణకు రూ.2.20 కోట్లు నిధుల మంజూరు

రోడ్డు విస్తరణకు రూ.2.20 కోట్లు నిధుల మంజూరు

నారాయణరావుపేట : నారాయణరావుపేట మండల కేంద్రం, గోపులాపూర్‌లో రోడ్డు విస్తరణ పనులు.. మురికి కాల్వల నిర్మాణానికి రూ.2.20 కోట్ల నిధులు మంజూరైనట్లు  ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బుధవారం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జక్కాపూర్‌ నుంచి మెదక్‌ - సిద్దిపేట రోడ్డును కలిపే రోడ్డులో గోపులాపూర్‌లో 300 మీటర్లు, నారాయణరావుపేటలో 400 మీటర్ల మేర గ్రామాల్లో గతంలో జక్కాపూర్‌ నుంచి నారాయణరావుపేట వరకు కొత్త రోడ్డు విస్తరణ పనులు జరిగాయి. అందులో భాగంగా గోపులాపూర్‌, నారాయణరావుపేట గ్రామాల్లో పనులు మిగిలిపోగా ఆ పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. పనులకు టెండర్‌ పిలిచామని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు.


logo