శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 22:25:16

రూ.19.60లక్షల విలువైన సిగరేట్లు, బీడీలు సీజ్‌

రూ.19.60లక్షల విలువైన సిగరేట్లు, బీడీలు సీజ్‌

మధిర : సరైన బిల్లులు లేకుండా, ప్రభుత్వానికి ట్యాక్స్‌ చెల్లించకుండా అక్రమంగా విక్రయాలు జరుపుతున్న రూ.19,60,610 విలువ చేసే బీడీలు, సిగరేట్ల బండిళ్లను టాస్క్‌ఫోర్సు పోలీసులు సీజ్‌ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన వ్యాపారులు కర్లపాటి కొండ, కేతేపల్లి కృష్ణకుమార్‌, ఎ.రవికుమార్‌, కే.పుల్లారావులు ఎటువంటి బిల్లులు లేకుండా బీడీలు, సిగరేట్లు విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో సీపీ, అడిషనల్‌ డీసీపీల సూనల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావు తన సిబ్బందితో దాడి చేసి రూ.19,60,610 విలువ చేసే బీడీలు, సిగరేట్ల బండిళ్లను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన బీడీ, సిగరేట్ల బండిళ్లను మధిర పట్టణ ఎస్సై ఉదయ్‌కుమార్‌కు అప్పగించడం జరిగిందని ఏసీపీ తెలిపారు. ఈ దాడుల్లో సీఐ వెంకటస్వామి, ఎస్సై రఘు, సిబ్బంది పాల్గొన్నారు.   logo