ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:29:20

రూ.17 లక్షల నకిలీ విత్తనాలు సీజ్‌

రూ.17 లక్షల నకిలీ విత్తనాలు సీజ్‌

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/ములుగు: పోలీసులు, విజిలెన్స్‌, వ్యవసాయాధికారులు కలిసి జరిపిన దాడిలో సుమారు రూ.17 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ఏడీ అశోక్‌ తెలిపారు.  మంగళవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు లో అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన మహేశ్‌ యాదవ్‌ వద్ద అనుమతి లేని నకిలీ పత్తి విత్తనాలను గుర్తించారు. అతడు ఇచ్చిన సమాచారంతో అదే గ్రామంలోని ‘జై హనుమాన్‌' విత్తన కంపెనీలో సోదాలు చేశారు. 337 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, 124 కిలోల విడి పత్తి విత్తనాలు, 696 ప్యాకెట్ల వరి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ రూ.17 లక్షలు ఉంటుందన్నారు. యూనిట్‌ యజమాని  గోవర్ధన్‌, సిబ్బందిపై కేసు నమోదు చేశామన్నారు.logo