గురువారం 09 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 15:41:07

సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 11,01,000 విరాళం అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 11,01,000 విరాళం అందజేత

హైదరాబాద్‌ : నగరంలోని పలు సంస్థలు సీఎం సహాయనిధికి నేడు రూ.11,01,000ను విరాళంగా అందజేశాయి. కోవిడ్‌-19పై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు పలువురు దాతలు, పారిశ్రామికవేత్తలు, ఎన్జీవోలు తమవంతు చేయూతను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా నగరంలోని ఫతేనగర్‌ స్టీల్‌ వ్యాపారుల అసోసియేషన్‌ రూ. 8,51,000, సంతన్‌బాగ్‌ రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ అసోసియేషన్‌ రూ.1,50,000, సికింద్రాబాద్‌కు చెందిన పుష్పా ట్రేడింగ్‌ కంపెనీ రూ. 1,00,000ను విరాళంగా సీఎంఆర్‌ఎఫ్‌కు అందించాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు అందజేశారు.


logo