శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:10:36

ఆర్టీసీకి అందలం

ఆర్టీసీకి అందలం
  • రూ.1,000 కోట్లు కేటాయింపు

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అందలం వేసింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించి భరోసా కల్పించింది. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్‌లో ఆర్టీసీ అభివృద్ధి, నిర్వహణ వ్యయం కోసం రూ.630 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో అదనంగా రూ.370 కోట్లు పెంచింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చే ఆర్టీసీ.. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన చర్యలతో లాభాలబాటలోకి వస్తున్నది. కార్గో, సర్వీసులను సైతం ప్రారంభించింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయీస్‌ బోర్డును ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది.


logo