ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:14:49

బ్రాహ్మణుల అభివృద్ధికి రూ.100 కోట్లు

బ్రాహ్మణుల అభివృద్ధికి రూ.100 కోట్లు

  • సర్కారు సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • కేవీ రమణాచారి, వేణుగోపాలాచారి

మన్సూరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం శ్రీవైష్ణవులు, బ్రాహ్మణుల అభివృద్ధి కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను నెలకొల్పి రూ.100 కోట్లు మంజూరుచేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రుణసాయాన్ని పేద బ్రాహ్మణులు సద్వినియోగంచేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ మన్సూరాబాద్‌ డివిజన్‌ చంద్రపురికాలనీలోని శ్రీవైష్ణవసదనంలో గురువారం 150 మంది పేద శ్రీవైష్ణవ మహిళలకు ఉచితంగా నిత్యావసర సరుకుల కిట్లతోపాటు ఆర్థికసాయం అందజేశారు. శ్రీవైష్ణవ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. బ్రాహ్మణులు, శ్రీవైష్ణవులు అపరకర్మలు చేసుకునేందుకు వీలుగా మన్సూరాబాద్‌లో ఒక భవనాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మన్సూరాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి, శ్రీవైష్ణవ సేవాసంఘం గౌరవ సలహాదారులు ఎస్టీ చారి, లక్ష్మీనాథాచార్యులు, ప్రధాన కార్యదర్శి మోహన్‌, కోశాధికారి సేనాపతి మోహన్‌, కార్యదర్శులు కే వెంకటాచార్యులు, సునీత పాల్గొన్నారు.


logo