ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 02:11:46

బ్యాంకులకు రూ.10 కోట్ల బురిడీ

బ్యాంకులకు రూ.10 కోట్ల బురిడీ

  • -భార్య అరెస్టు.. పరారీలో భర్త

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కల్పిత ఆస్తులతో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని తనఖాపెట్టి బ్యాంకుల నుంచి రూ.10 కోట్లకుపైగా రుణాలు ఘరానా దంపతుల్లో భర్యను గురువారం హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టుచేశారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చేపట్టారు. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి వివరాల ప్రకారం.. క్రోమో ఆటోమొటివ్‌ సంస్థలో భాగస్వాములైన అత్తాపూర్‌, కాంతరెడ్డినగర్‌కు చెందిన రావుల వెంకటేశ్‌, శ్రీలత దంపతులు. తమ వ్యాపార అవసరాల కోసం 2010 డిసెంబర్‌లో ఎస్బీఐలో ఉప్పల్‌ భాగయాత్‌కు చెందిన కొన్ని ఆస్తులను ష్యూరిటీగా పెట్టి రూ.3.02 కోట్ల రుణం పొందారు. వాయిదాలు చెల్లించకపోవడంతో ఆస్తుల రికవరీ వ్యవహారాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు.. తనఖాపెట్టిన ఆస్తులన్ని కల్పితాలేనని గుర్తించారు. వారిపై గతనెలలో సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఏసీపీ వెంకట్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తు జరిపి నిందితుల్లో ఒకరైన రావుల శ్రీలతను అరెస్టు చేశారు. ఈ దంపతులపై సీసీఎస్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. 2004 నుంచి 2012 మధ్య ఎస్బీఐ నుంచి రూ.3 కోట్ల రుణం పొందారు. మహేశ్వరంలోని వ్యవసాయ భూమిని, ఉప్పల్‌ సరస్వతినగర్‌లోని కొన్ని ఫ్లాట్లను ష్యూరిటీగా పెట్టారు. అవి కూడా నకిలీవని తేలాయి. మరో రెండు జాతీయ బ్యాంకుల నుంచి కూడా వీరు రూ.4 కోట్లకుపైగానే రుణం పొంది ఎగ్గొట్టారని పోలీసులు పేర్కొన్నారు. logo