శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 15:27:33

హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా సొత్తు పట్టివేత

హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా సొత్తు పట్టివేత

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీగా హవాలా సొత్తును పోలీసులు పట్టుకున్నారు. రూ.కోటి నగదును హవాలా మార్గంలో తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఓ వ్యక్తి డబ్బును వాహనంలో తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలేసి పట్టుకున్నారు. అలాగే సదరు వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో హవాలా సొత్తును తరలిస్తున్నారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. అయితే గత రెండు రోజుల్లో నుంచి పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో పోలీసులు రూ.50లక్షల వరకు హవాలా మార్గంలో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదుగురు వ్యక్తులను సైతం అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఇంకా తెలియాల్సి ఉంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.