గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 06:04:52

రూ.1.50కోట్లతో లక్నవరంలో అభివృద్ధి పనులు...

రూ.1.50కోట్లతో లక్నవరంలో అభివృద్ధి పనులు...

గోవిందరావుపేట: పర్యాటక ప్రాంతమైన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుపై మరో వంతెన ఏర్పాటుకు పర్యాటక శాఖ అధికారులు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో 130 మీటర్ల పొడవుతో మరో వంతెన నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరస్సుపై ఇప్పటికే రెండు వంతెనలు నిర్మించగా దేశ, విదేశీ పర్యాటకులు సైతం అబ్బురపోతున్నారు. మూడో వంతెన ఏర్పాటైతే సరస్సుకు మరింత అందం చేకూరడంతోపాటు పర్యాటకులు సైతం ఫిదా కానున్నారు. రెండో ఐలాండ్‌ నుంచి మూడో ఐలాండ్‌ వరకు ఈ వంతెనను నిర్మిస్తారు. దీంతోపాటు వ్యూపాయింట్‌ నుంచి ఇక్కడి అందాలు తిలకించేందుకు టవర్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ శ్రీకారం చుట్టింది. సత్వరం వంతెనను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిసింది. logo
>>>>>>