మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 00:28:29

పండ్ల వ్యాపారి ఇంట్లో రూ. 1.07 కోట్లు

పండ్ల వ్యాపారి ఇంట్లో రూ. 1.07 కోట్లు

ఖిలా వరంగల్‌: పండ్ల వ్యాపారి ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రూ.1.07 కోట్ల నగదును పట్టుకొన్న ఘటన సోమవారం వరంగల్‌ మిల్స్‌కాలనీ పరిధిలో చోటుచేసుకున్నది. ఆంధ్రా నుంచి వరంగల్‌కు ఎలాంటి పత్రాలు లేకుండా భారీగా నగదును ఓ వాహనంలో తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో మిల్స్‌కాలనీ పీఎస్‌ సమీపంలో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు నందిరామ్‌, మధు తనిఖీలు చేపట్టారు. అయితే సదరు వాహనంలో ఎలాంటి నగదు లభించలేదు. దీంతో శివనగర్‌లోని పండ్ల వ్యాపారి కొవ్వూరి మధుసూదన్‌రెడ్డి ఇంటిపై దాడి చేయగా రూ.కోటీ ఏడు లక్షలు దొరికాయి. డబ్బుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు.  


logo