గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 13:26:01

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా కో ఫౌండర్ రాఘవ గారు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు ఖాజాగూడ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా  రాకేష్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. నా జీవితంలో ఇలాంటి మంచి కార్యక్రమం ఎప్పుడు చూడలేదు. నా ఎదుగుదలతో పాటు ఈరోజు నేను నాటిన మొక్కలు కూడా పెరుగుతుంటాయి. దాన్ని చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది.  డబ్బులు మనకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నాటిన మొక్క అలాగే ఎదుగుతుంది.

ఇంత వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న గారికి కృతజ్ఞతలు .సంతోష్ అన్న నాకు అత్యంత ఆత్మీయుడు. సంతోష్ అన్న చిరునవ్వును చూస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ మొత్తం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాతావరణంలో వచ్చే మార్పులను కాలుష్య నియంత్రణను హరికట్టాలంటే మొక్కలు నాటడం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. నేను ఈ సందర్భంగా మా జబర్దస్త్ టీం సభ్యులైన నేహంత్, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, అవినాష్, పొట్టి నరేష్ లను మొక్కలు నాటాలని చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ; ప్రతినిధి కిషోర్ గౌడ్; గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా పాల్గొన్నారు.




logo