బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 01:53:51

కరోనా టెస్ట్‌.. సూపర్‌ ఫాస్ట్‌

కరోనా టెస్ట్‌.. సూపర్‌ ఫాస్ట్‌

  • నిమ్స్‌లో కోబాస్‌ 8800 అధునాతన యంత్రం ప్రారంభం

శ్రీనగర్‌కాలనీ: రాష్ట్రంలో కరోనా అనుమానితుల నమూనాలను మరింత వేగంగా పరీక్షించేందుకు కోబాస్‌ 8800 ఆధునికయంత్రం అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజూ 3 వేల నుంచి 4 వేల వరకు నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం ఈ యంత్రం సొంతం. నిమ్స్‌ ప్రాంగణంలో రూ.7 కోట్లతో ఏర్పాటుచేసిన మాలిక్యులర్‌ ల్యాబ్‌, కోబాస్‌ 8800 ఆధునిక యంత్రాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం ప్రారంభించారు. తొలిసారి అన్నిరకాల వ్యాధులను నిర్ధారించేందుకు నిమ్స్‌లో ఆధునిక యంత్రా న్ని ఏర్పాటుచేసినట్టు ఈటల వెల్లడించారు. logo