బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 10:21:02

శంషాబాద్‌లో దొంగ‌ల బీభ‌త్సం

శంషాబాద్‌లో దొంగ‌ల బీభ‌త్సం

హైద‌రాబాద్‌: న‌గ‌ర శివార్ల‌లోని శంషాబాద్‌లో దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. మండలంలోని ఉట్‌ప‌ల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి అనంతయ్య గౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 8 తులాల బంగారం, 5 సెల్‌ఫోన్లను అపహరించారు. పక్కనే ఉన్న భలరాం అనే వ్యక్తి ఇంటి తాళాలను పగులగొట్టేందుకు యత్నించారు. అయితే అది రాక‌పోవ‌డంతో అక్క‌డినుంచి ప‌రార‌య్యారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నాని ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. క్లూస్‌ టీంల‌ను ర‌ప్పించి ఆధారాలు సేక‌రిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo