మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 14:22:41

రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : తగు జాగ్రత్తలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు జరుగుతున్న హైవే విస్తరణ పనులను మంత్రి  కొత్త తండ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహబూబ్ నగర్ రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపట్టడమే కాకుండా మిషన్ భగీరథ పైపులైన్ కు ఎలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పై ఉందన్నారు. 

నాలుగు లేన్ల రోడ్డు విస్తరణలో భాగంగా కొనసాగుతున్న పనుల వల్ల మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి పట్టణంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఆగిపోయింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులు సైతం సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలన్నారు.logo