ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 15:38:59

అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్ల విస్తరణ : మేయర్‌ బొంతు రామ్మోహన్‌

అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్ల విస్తరణ : మేయర్‌ బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్‌ : నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. హరితహారంలో భాగాంగా నగరంలోని శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయం వద్ద మేయర్‌ నేడు మొక్కలు నాటారు. అనంతరం శేరిలింగంపల్లి జోన్‌లో లింక్‌ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లింక్‌ రోడ్డు పనులు జులై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ఆమోదం లభించాక అండర్‌ బ్రిడ్జి పనులు చేపడతామన్నారు. నాలుగు ప్యాకేజీలుగా 44.63 కిలోమీటర్ల మేర 37 లింక్‌ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.logo