శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 11:37:49

ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డు ప్ర‌మాదం

వ‌న‌ప‌ర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట అమడబాకుల స్టేజి వ‌ద్ద జాతీయ ర‌హ‌దారి 44పై మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన రెండు కార్లు అదుపుత‌ప్పి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కర్నూల్ వైపు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న KA 03 NA 8731నంబర్ గల కారు, హైదరాబాద్ వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న AP 22 AM 6097 నంబర్ కారును డివైడర్ దాటి వచ్చి ఢీకొట్టింది.