ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 02, 2020 , 00:35:32

గుంటూరులో రోడ్డుప్రమాదం

 గుంటూరులో రోడ్డుప్రమాదం
  • ఆరుగురు దుర్మరణం.. అదుపుతప్పి కాలువలో పడిన టవేరా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గుంటూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుం ట వద్ద (ఐదో మైలు వద్ద) టవేరా వాహనం అదుపుతప్పి వాగులో పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు కాకుమానుకు చెందిన శ్రీను (50), వీరలక్ష్మి (48), ప్రసాదం (55), సీతమ్మ (65), రమణ (48), సుబ్బులుగా గుర్తించారు. క్షతగాత్రులను గుంటూరులోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానిక పోలీసులు చెప్తున్నారు. కాకుమానుకు చెందిన వీరంతా గుంటూరు రూరల్‌ మండలం ఏటుకూరులో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 


మిర్చి లారీ బోల్తా.. నలుగురు రైతులు మృతి

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపు రం తండా వద్ద ఆదివారం సాయంత్రం మరో  ప్రమాదం జరిగింది. మిర్చిలోడుతో వెళ్తున్న లారీ క్వారీగుంతలో బోల్తా పడటంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బోధిలవీడుకు చెందిన రైతులు మిర్చి పంటను మార్కెట్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. 


logo