ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. గురువారం ఈ దుర్ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత (22) ఎంఎస్ చదివేందుకు ఏడాది క్రితం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నది.
గురువారం బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న విషయం తెలుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రక్షిత మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షిత తండ్రి వెంకట్ రెడ్డి ఆర్మీలో పనిచేసి స్వచ్ఛందంగా రిటైరై ప్రస్తుతం డీఆర్డీఏలో ఉద్యోగం చేస్తున్నారు. వెంకట్ రెడ్డి, అనిత దంపతులకు కూతురు, కుమారుడు సంతానం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ