శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 07:29:36

తొర్రూరులో బోల్తాప‌డ్డ లారీ.. న‌లుగురు కూలీల మృతి

తొర్రూరులో బోల్తాప‌డ్డ లారీ.. న‌లుగురు కూలీల మృతి

మహ‌బూబాబాద్‌: జిల్లాలోని తొర్రూరులో లారీ బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు కూలీలు మ‌ర‌ణించారు. క‌ర్ర‌ల లోడుతో వెళ్తున్న లారీ తొర్రూరు మండ‌లంలోని చీక‌టాయ‌పాలెంలో గురువారం ఉద‌యం అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. దీంతో న‌లుగురు కూలీలు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

ప్ర‌మాద సమ‌యంలో లారీలో 11 మంది కూలీలు ఉన్నారు. న‌లుగురు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఏడుగురు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండ‌లం ఆంబోతుతండాకు చెందిన హ‌ర్యా, గోవింద‌ర్‌, మ‌ధు, ధూర్యాగా గుర్తించారు. ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


logo