ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 01:24:17

‘అన్నపూర్ణ’లోకి జలాల ఎత్తిపోత

‘అన్నపూర్ణ’లోకి జలాల ఎత్తిపోత
  • పెరుగుతున్న రిజర్వాయర్‌ నీటిమట్టం

ఇల్లంతకుంట: అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలు విజయవంతంగా సాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ సర్జ్‌పూల్‌ (మహాబావి)లో ఒకటి, నాలుగో నంబర్‌ మోటర్లను విడతల వారీగా నడిపిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 వరకు ఒకటో పంపు, సాయంత్రం 5 నుంచి 18 నిమిషాలపాటు నాలుగో మోటర్‌ను నడిపించారు. డెలివరీ సిస్టర్న్‌ నుంచి కాళేశ్వర జలాలు అన్నపూర్ణ జలాశయంలోకి పరుగులు తీశాయి. ఇప్పటివరకు ఈ రిజర్వాయర్‌లో  0.68 టీఎంసీ నీరు నిల్వ ఉన్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

 

లక్ష్మి పంప్‌హౌజ్‌ నుంచి..  

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి పంప్‌హౌజ్‌లో 9వ మోటర్‌ నిరంతరంగా నడుస్తున్నది. దీంతో సరస్వతి బరాజ్‌కు రోజుకు 2,300 క్యూసెక్కుల నీరు తరలివెళ్తున్నది.


logo