బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 14:57:20

పెరుగుతున్న కరోనా కేసులు..అప్రమత్తమైన అధికారులు

 పెరుగుతున్న కరోనా కేసులు..అప్రమత్తమైన అధికారులు

మహబూబాబాద్ : జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టారు. గురువారం కేసముద్రం మండలంలోని ధనసరి, చైతన్యనగర్ లో కలెక్టర్ వీపీ గౌతం, వైద్య బృందం, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, పోలీస్ అధికారులుతో కలిసి విస్తృతంగా పర్యటించారు.

తొలుత  కేసముద్రం పట్టణంలోని  ధనసరి గ్రామాన్ని సందర్శించారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల ఇండ్లకు కలెక్టర్ స్వయంగా బృందంతో వెళ్లి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించారు. అలాగే రోజు వారి చేస్తున్న ర్యాపిడ్ టెస్ట్ పరీక్షలను కూడా రిజిస్టర్ ద్వారా పరిశీలించారు. కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ప్రజలు కరోనా బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు.logo