శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 01, 2020 , 00:39:45

అందుబాటులో వరికోత యంత్రాలు

అందుబాటులో వరికోత యంత్రాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో ఉన్న వరికోత యంత్రాల వివరాలను సేకరించి, రైతులకు అందుబాటులో ఉండే లా చూడాలని వ్యవసాయశాఖ కార్యదర్శి డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వరి, మక్కజొన్న కొనుగోళ్ల ఏ ర్పాట్లకు సంబంధించి వ్యవసాయశాఖ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో 11,697 పంట కోత యంత్రాలు ఉండగా.. వాటిలో ఎన్ని రాష్ర్టానికి చెందినవాటిని గుర్తించాలని చె ప్పారు. ఐకేపీ కాంటాలు, తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్పాలిన్ల లభ్యత గురించి తెలుపాలన్నారు. అనుమతి లేక అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోయిన పంటకోత యంత్రాలను రప్పించాలని సూచించారు. అలాగే, విడిభాగాల సరఫరా, మరమ్మతు ఏర్పాట్లు చేయాలని.. మెకానిక్‌, హమాలీలు, కూరగాయలు, పండ్లు రవాణాచేసే వాహనాలకు పాసులు ఇప్పించాలని ఆదేశించారు.


logo