గురువారం 09 జూలై 2020
Telangana - Apr 11, 2020 , 22:40:00

పారిశుధ్య కార్మికుల కోసం బియ్యం, పప్పు

పారిశుధ్య కార్మికుల కోసం బియ్యం, పప్పు

హైదరాబాద్‌:  ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో ఆహార పదార్థాలకోసం ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. పేదలకు పంపిణీ చేసేందుకుగాను నగరంలో పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి బియ్యం, పప్పు దినుసులు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  

 ఆర్చ్‌ డయోసిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థ శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో 175క్వింటాళ్ల బియ్యం, 30క్వింటాళ్ల పప్పు దినుసులను మేయర్‌కు అందించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, ఎల్బీనగర్‌ జోన్‌లోని పారిశుధ్య కార్మికులకు వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.


logo