సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 16:56:58

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి

పెద్దపల్లి : రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ( ఆర్.ఎఫ్.సీ.ఎల్ ) సీఈవో నిర్లేప్ సింగ్ రాయ్, చీఫ్ ఫైనాన్సిల్ ఆఫీసర్ సంజయ్ జిందాల్ బుధవారం మంత్రుల నివాసంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియుమితులై ఏడాది అయిన నేపథ్యంలో వారు వినోద్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.రామగుండం ఎరువుల కర్మాగారం పనుల పురోగతి గురించి వినోద్ కుమార్ వారితో ప్రస్తావించారు.

ఎరువుల కర్మాగారం పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ఎరువుల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని వినోద్‌కుమార్‌కు వివరించారు. ఆర్.ఎఫ్.సీ.ఎల్.లో స్థానికులకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యతను కల్పించాలని, ఉపాధి అవకాశాలను చూపాలని వినోద్ కుమార్ సీఈఓ రాయ్‌కు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.