బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 23:27:01

సంఘం పేరుతో విప్లవ సాహిత్యం

సంఘం పేరుతో విప్లవ సాహిత్యం

పీవీ నరసింహారావు సంఘాల నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించేవారు. వరంగల్లో చదువుకుంటున్న రోజుల్లోనే తోటివారితో కలిసి భజన మండలి పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలోనే పీవీ రహస్యంగా విప్లవ సాహిత్యాన్ని చదివేవారు. ఆ రోజుల్లోనే మాగ్జిమ్‌ గోర్కి రాసిన అమ్మ నవలను చదవడమే కాక దానిపై చర్చలను నిర్వహించారు. నిజాం అరాచకాలపై ఎక్కువగా చర్చలు జరిపేవారు. ఆ తర్వాతి కాలంలోనూ అనేక సంఘాలను నెలకొల్పడంలో పీవీ కీలక భూమిక పోషించారు. ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆరట్స్‌, దక్షిణ భారత హిందీ ప్రచారసభ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ, స్వామి రామానంద తీర్థ  మెమోరియల్‌ కమిటీ, గాంధీభవన్‌ ట్రస్ట్‌, హైదరాబాద్‌, భాగ్యనగర్‌ ఖాదీసమితి ఇలా మరెన్నో సంస్థల్లో క్రియాశీలకపాత్ర పోషించారు.


logo