మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 14:35:26

రైతు వేదికల నిర్మాణాలతో విప్లవాత్మక మార్పులు : మంత్రి జగదీష్‌ రెడ్డి

రైతు వేదికల నిర్మాణాలతో విప్లవాత్మక మార్పులు : మంత్రి జగదీష్‌ రెడ్డి

యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్న రైతు వేదికలు వ్యవసాయ చరిత్రలో  పెను మార్పులకు శ్రీకారం చుడతాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రామన్నపేట మండలంలో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ లింగయ్య యాదవ్, కలెక్టర్ అనితా రాంచంద్రన్ లతో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు, రైతు వేదికలకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..స్వయాన రైతైన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేసేందుకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు  సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారని తెలిపారు. రైతు వేదికల ద్వారా రైతులు అన్ని విషయాలపై చర్చలు జరుపుకుని, మార్కెటింగ్ కు అనుగుణo గా  పంటలు వేస్తూ లాభాలు గడించాలని మంత్రి పిలునిచ్చారు. అనంతరం రామన్నపేట మండల కేంద్రంలో వెటర్నరీ హాస్పిటల్ కు భూమి పూజ చేసి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతనంతరం ఆరో విడత హరితహారం లో  భాగంగా మొక్కలు నాటారు. logo