గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 13:26:52

రైతు వేదికల నిర్మాణంతో.. విప్లవాత్మకమైన మార్పులు

రైతు వేదికల నిర్మాణంతో.. విప్లవాత్మకమైన మార్పులు

జగిత్యాల : రైతులు పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చే వరకు కష్టాలతో సహవాసం చేసే అన్నదాతలకు సాగులో సమస్యలు చర్చించుకునేందుకే రైతు వేదికల నిర్మాణమనిసంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి మండలం రాజారాం గ్రామంలో రూ. 22 లక్షల అంచనా వ్యయంతో  రైతు వేదిక భవన నిర్మాణాలకు మంత్రి భూమి పూజ చేసి మాట్లాడారు. ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్ కు ఒకటి చొప్పున ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించనున్ననదని తెలిపారు.

అన్నదాతలను ఆత్మబంధువులుగా భావించిన ప్రభుత్వం రాష్ట్రంలో 2,604 రైతు వేదికలు నిర్మిస్తుందన్నారు. రైతులు ఒకే దగ్గర సమావేశమై, పంట, దిగుబడులు, లాభాలు, తదితర అంశాలపై మాట్లాడుకునేందుకు రైతు వేదికలు ఉపయోగపడుతాయన్నారు. రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo