శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 16, 2020 , 16:07:45

వ్యవసాయానికి పునరుత్తేజం : మంత్రి ఐకేరెడ్డి

వ్యవసాయానికి పునరుత్తేజం : మంత్రి ఐకేరెడ్డి

నిర్మల్‌ : సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన వ్యవసాయరంగం స్వరాష్ట్రంలో పునరుత్తేజం పొందిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం సోన్‌ మండల కేంద్రంలో రూ.22లక్షలతో నిర్మించనున్న రైతుబంధు వేదిక నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తక్కువ కాలంలోనే వ్యవసాయ రంగం అనూహ్యంగా అభివృద్ధి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనికత, ముందు చూపుతోనే సాధ్యపడిందని చెప్పారు. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులందరికీ రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5వేలు ఇస్తున్న ఘనత టీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

అలాగే రైతుల కోసం బీమా పథకం అమలు చేస్తుందన్నారు. పొలాలకు 24గంటల కరెంటు ఇస్తుందని, దీంతో రూ.7వేల కోట్లు సబ్సిడీ భారం పడుతున్న రైతుల మేలు కోసం ఈ భారం భరిస్తుందన్నారు. రైతుబంధుతో రైతన్న ఇవాళ ధైర్యంగా ఉన్నాడని, పండించిన ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతుల కోసం వేదికలు నిర్మిస్తున్నామని, అందరు చర్చించుకునేందుకు, వ్యవసాయాధికారులతో సమావేశమయ్యేందుకు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. అనంత‌రం లక్ష్మణచాంద మండలం వ‌డ్యాల్ గ్రామంలో రైతు వేదిక భ‌వ‌న నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo