గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 16:28:05

వందశాతం రిజర్వేషన్ల ఉత్తర్వును కొట్టివేయడంపై రివ్యూ పిటిషన్‌

వందశాతం రిజర్వేషన్ల ఉత్తర్వును కొట్టివేయడంపై రివ్యూ పిటిషన్‌

హైదరాబాద్‌ : ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్‌ శుక్రవారం సమావేశం నిర్వహించారు. గిరిజనులకు వందశాతం రిజర్వేషన్ల ఉత్తర్వును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేయడంపై భేటీలో మంత్రి చర్చించారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని సీఎం సైతం నిర్ణయించారన్నారు. పక్కా ప్రణాళికతో కసరత్తు చేసి త్వరలోనే పిటిషన్‌ వేస్తామన్నారు. న్యాయనిపుణులు, గిరిజన పెద్దల సలహాతో పిటిషన్‌ తయారుచేయనున్నట్లు తెలిపారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, గిరిజనుల హక్కుల రక్షణకు సహకరించాలని కేంద్రాన్ని కూడా కోరినట్లు మంత్రి పేర్కొన్నారు.


logo