శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 16:16:26

కరివెన రిజర్వాయర్‌ పనుల పురోగతిపై సమీక్ష

కరివెన రిజర్వాయర్‌ పనుల పురోగతిపై సమీక్ష

మహమూబ్‌నగర్‌ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కరివెన రిజర్వాయర్ పనుల పురోగతిపై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఈఈ దయానంద్, ప్యాకేజీ నెం.14, ప్యాకేజీ నెం.15 డీఈఈలు ప్రభాకర్‌రెడ్డి, విజయేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రిజర్వాయర్‌ కట్ట పనులు 70శాతం పూర్తయ్యాయని, ఇంకా 30 శాతం పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఏడాదిలోగా రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఆయకట్టు కాలువలకు సంబంధించి అంచనాలు, డిజైన్లు తదితర వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. రైతుల పొలాలకు వెళ్లే కాలువల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కాలువ ద్వారా సాగునీరు వచ్చేవిధంగా డిజైన్లు ఉండాలని, కరివెన రిజర్వాయర్ నిర్మాణం పనులలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు.logo