గురువారం 09 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 22:15:46

ప్రైవేటు ల్యాబ్‌లపై వేటు తప్పదు: మంత్రి ఈటెల

ప్రైవేటు ల్యాబ్‌లపై వేటు తప్పదు: మంత్రి ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌పై మంత్రి ఈటెల రాజేందర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జంట నగరాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... టిమ్స్‌లో సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయ్యింది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో అవకతవకలపై కమిటీ విస్తృతంగా పరిశీలించారు. కొన్ని ల్యాబ్‌లలో 70శాతం నమూనాలు పాజిటివ్‌ రావడం అనుమానం కలిగిస్తుంది. రెండు మూడు రోజుల్లో ప్రైవేటు ల్యాబ్‌లు ఇచ్చిన ఫలితాల్లో నిజాలను కమిటీ తేల్చనుంది. అవకతవకలకు పాల్పడుతున్న ల్యాబ్‌లకు మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. లోపాలు సరిదిద్దుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా ఇంటింటికీ కరోనా సర్వే చేపడుతామని వెల్లడించారు. 


logo