మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 10:48:40

12 గంట‌ల్లోగా రెవెన్యూ రికార్డులు స‌మ‌ర్పించండి..

12 గంట‌ల్లోగా రెవెన్యూ రికార్డులు స‌మ‌ర్పించండి..

హైద‌రాబాద్‌: కొత్త రెవెన్యూ చ‌ట్టం దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. మ‌‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోగా రికార్డులను క‌లెక్ట‌రేట్‌లో అప్ప‌గించాల‌ని వీఆర్వోల‌కు స్ప‌ష్టంచేసింది. రికార్డుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల్లోగా పూర్తికావాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. క‌లెక్ట‌ర్ల నుంచి సాయంత్రంలోగా స‌మ‌గ్ర నివేదిక రావాల‌ని ఆదేశించారు. 

అసెంబ్లీ స‌మావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు తీసుకురావాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని ప్ర‌స్తుత‌ స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్టాల‌ని సీఎం నిర్ణ‌యించారు. దీనిపై స‌వివ‌రంగా చ‌ర్చించ‌నున్నారు. 


logo