గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 02:13:51

అడవి బిడ్డల రెవెన్యూ సంబురం

అడవి బిడ్డల రెవెన్యూ సంబురం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆదివాసీ రైతులు భారీ ర్యాలీ తీశారు. సుమారు 400 ట్రాక్టర్లు, 500 బైక్‌లపై రైతులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చారు. ట్రాక్ట ర్లు, బైక్‌లపై సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. అటవీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు.logo