బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:01:23

ఫ్లైయాష్‌ రవాణాతో రైల్వేకు 26 లక్షల ఆదాయం

ఫ్లైయాష్‌ రవాణాతో రైల్వేకు 26 లక్షల ఆదాయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో భాగంగా తొలిసారిగా ఫ్లైయాష్‌ను రవాణా చేసింది. సరుకు రవాణాను పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా వివిధ సంస్థలను సంప్రదిస్తూ వ్యాపార అవకాశాలను పెంచుకుంటున్నది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి కర్ణాటకలోని వాడి వద్ద ఉన్న ఏసీసీ కంపెనీకి ఫ్లైయాష్‌ను రవాణా చేసింది. మంగళవారం వాడీకి ఈ రైలుచేరింది. 3,876 టన్నుల ఫ్లైయాష్‌ను 57 వ్యాగన్లలో రవాణా చేశారు. తద్వారా దక్షిణ మధ్య రైల్వేకు రూ.26.12 లక్షల ఆదాయం సమకూరింది. ఇప్పటివరకు రోడ్డుమార్గంలో ఫ్లైయాష్‌ను రవాణాచేస్తున్నారు. రోడ్డుమార్గం ద్వారా అధిక వ్యయంతోపాటు కాలుష్య ప్రభావం కూడా ఉంటుంది.


logo