బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 02:10:56

ఆన్‌లైన్‌ ‘ఫ్యాన్సీ’తో అధికాదాయం

ఆన్‌లైన్‌ ‘ఫ్యాన్సీ’తో అధికాదాయం
  • త్వరలో రాష్ట్రమంతటా ప్రవేశపెట్టేందుకు చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నంబర్‌ వేలంతో ఆదాయం పెరిగింది. పలు నంబర్లకు ఊహించని రీతిలో రెట్టింపు ధర పలికింది. గత నెల 10వ తేదీన మొదలైన ఆన్‌లైన్‌ ఫ్యాన్సీ నంబర్ల ఈ-బిడ్డింగ్‌ ప్రక్రియ విజయవంతం కావడంతో అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిధిలోని ఐదు ఆర్టీఏ కార్యాలయాల్లో మొదలుపెట్టిన ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో త్వరలో రాష్ట్రమంతటా అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్సీ నంబర్లకు మాన్యువల్‌గా వేలం పాట వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రావాల్సినంత ఆదాయం రావడంలేదని గ్రహించిన ప్రభుత్వం.. ఆన్‌లైన్‌ ద్వారా వేలంపాట చేపట్టాలని నిర్ణయించింది. 


ఆదాయం పెంచడమే లక్ష్యం: పువ్వాడ అజయ్‌కుమార్‌

వాహనదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు రవాణాశాఖ ఆదాయాన్ని కూడా పెంచుతున్నాం. ఇప్పటికే పలు సేవలను ఆన్‌లైన్‌ చేయడంతో వాహనదారులకు పలు ఇబ్బందులు తొలిగిపోయాయి.


logo