e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home Top Slides ఎవడు గాడిద!

ఎవడు గాడిద!

  • శశిథరూర్‌ గాడిద అని తిట్టిన రేవంత్‌.. పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రేలాపన ఘాటుగా స్పందించిన థరూర్‌.. రేవంత్‌కు చురకలు.. గాడిద తమ్ముడేమోనంటూ రిటార్ట్‌

ఇటీవలి పర్యటనలో కేటీఆర్‌పై థరూర్‌ ప్రశంసలు.. జీర్ణించుకోలేని రేవంత్‌.. గాడిద, బేవకూఫ్‌ అంటూ గల్లీభాషలో తిట్ల దండకం జాతీయ స్థాయిలో దుమారం ఉపసంహరించుకోవాలన్నకాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తివారీ థర్డ్‌ రేట్‌ క్రిమినల్‌ ఒక పార్టీకినాయకుడైతే ఇలాగే ఉంటుందిపీసీసీ ‘చీప్‌’ అంటూ కౌంటరిచ్చిన మంత్రి కేటీఆర్‌మొదట బుకాయించిన రేవంత్‌ఆడియో బయటపడటంతోక్షమించాలంటూ థరూర్‌కు ఫోన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (నమస్తే తెలంగాణ):
కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినంత మాత్రాన వెనకటి బుద్ధులేడికి పోతయన్నట్టు.. వదరుబోతు రేవంత్‌రెడ్డి లాంటి కురచ బుద్ధుల నేతను అందలమెక్కించినందుకు ఆ పార్టీ పాపపు ఫలితాన్ని అనుభవిస్తున్నది. నోరున్నది కదా అని ఎవరినైనా తిట్టించవచ్చుననుకొని పీసీసీ పీఠంపై కూర్చోబెట్టినందుకు అదే భస్మాసురహస్తంగా మారింది. ఇతరులను తిడతాడనుకొంటే.. తమ పార్టీ జాతీయ స్థాయి నాయకులనే అడ్డగోలుగా తిట్టించుకొనే పరిస్థితిని కోరి కొని తెచ్చుకొన్నది. భారతదేశంలో శశిథరూర్‌ ఒక మంచి స్కాలర్‌. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు ప్రతినిధిత్వం వహించిన నేత. కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు పార్లమెంటరీ స్థాయీసంఘానికి నేతృత్వం వహిస్తున్నశశిథరూర్‌ను గాడిద అంటూ అత్యంత అమర్యాదకరంగా రేవంత్‌ అవమానించారు. బరితెగించి నానా మాటలు అని.. తీరా పత్రికల్లో వచ్చాక తాను అనలేదంటూ అబద్ధాలాడటానికి కొంచెం కూడా సిగ్గు పడని రేవంత్‌.. తర్వాత ఆడియో క్లిప్పులు విడుదల కావడంతో.. ఓటుకు నోటు కేసు దొంగ మరోసారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా రేవంత్‌ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని హెచ్చరించడంతో రేవంత్‌ తోకముడిచి క్షమాపణ చెప్పాల్సివచ్చింది.

శశి థరూర్‌ తీవ్ర ఆగ్రహం

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. తనను ‘గాడిద’ అంటూ రేవంత్‌ తిట్టడంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘ఆయన తన మూలాలను గుర్తుచేసుకొంటూ, సోదర భావాలను వ్యక్తంచేశారేమో’ అని రేవంత్‌ను పరోక్షంగా గాడిద సంతతితో పోల్చి ట్విట్టర్‌ వేదికగా చురకలేశారు. ఐటీ రంగంపై పార్లమెంట్‌ నియమించిన శశిథరూర్‌ సారథ్యంలోని స్థాయీసంఘం ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి, ఇం దుకు మంత్రి కేటీఆర్‌ చేసిన కృషికి శశిథరూర్‌ ఫిదా అయిపోయారు. పలుమార్లు నేరుగానే కేటీఆర్‌ను అభినందించారు. కానీ, శశిథరూర్‌ మంత్రి కేటీఆర్‌ను, రాష్ట్ర అభివృద్ధిని మెచ్చుకోవడం రేవంత్‌ జీర్ణించుకోలేకపోయారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ‘ఇక్కడ ఏం జరుగుతుందో ఆ బేవకూఫ్‌కు తెలిసుండాలి.. నాలుగు ఇంగ్లిష్‌ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్ప కాదు.. అది కమ్యునికేషన్‌ స్కిల్‌ మాత్ర మే. నా దృష్టిలో అతడో గాడిద.. ఇలాంటి వాళ్ల ను పార్టీ నుంచి బహిష్కరించాలి’ అంటూ శశిథరూర్‌పై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలుచేస్తూ విరుచుకుపడ్డారు. రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆంగ్ల దినపత్రిక ప్రచురించడం సంచలనంగా మారింది.

సొంత పార్టీ నుంచి విమర్శలు

రేవంత్‌రెడ్డి నోరు పారేసుకోవడంపై రాష్ట్ర స్థాయి కాంగ్రెస్‌ నేతలతోపాటు జాతీయ స్థాయి నేతల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. రేవంత్‌ తన వ్యాఖ్యలను తక్షణమే విరమించుకోవాలని, లేదంటే అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

వ్యాఖ్యలు ఉససంహరించుకోవాలి: మనీశ్‌

శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను రేవంత్‌ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నేత మనీశ్‌తివారీ హెచ్చరించారు. కాగా, శశిథరూర్‌పై రేవంత్‌రెడ్డిచేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన కథనాన్ని ఆ పత్రిక హైదరాబాద్‌ రెసిడెంట్‌ ఎడిటర్‌ సీహెచ్‌వీఎం కృష్ణారావు సమర్థించుకున్నారు. తమ కథనానికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్‌ కూడా సాక్ష్యంగా ఉన్నదని ట్విటర్‌లో పోస్టుచేశారు.

తెలంగాణ ప్రజలు హర్షించరు: సబిత

ప్రతిసారీ మంత్రి కేటీఆర్‌పై అసభ్యపదజాలంతో రేవంత్‌ మాట్లాడటం మంచిది కాదని, దీన్ని తెలంగాణ ప్రజలు హర్షించరని మంత్రి సబితాఇంద్రారెడ్డి హితవు పలికారు. రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. ‘మీరు అబద్ధాల కోరని, యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిసార్డర్‌ (ఏఎస్‌పీడీ) వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు. ముందుగా మీరు సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. మీ వైద్య ఖర్చులు మేము భరిస్తాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

  • క్షమించండి: రేవంత్‌రెడ్డి

శశిథరూర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో రేవంత్‌రెడ్డి తోకముడిచారు. బుధవారం శశిథరూర్‌కు ఫోన్‌చేసి క్షమాపణలు కోరారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

థర్డ్‌ రేట్‌ క్రిమినల్‌ నాయకుడైతే ఇలాగే ఉంటుంది: మంత్రి కేటీఆర్‌

శశిథరూర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. రేవంత్‌ వ్యాఖ్యల కథనాన్ని, ఆయన ఆడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. రేవంత్‌ను పీసీసీ‘చీప్‌’గా అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి వంటి ఓ థర్డ్‌ రేట్‌ క్రిమినల్‌ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్‌రెడ్డిలాంటి నీచమైన వ్యక్తులు స్పందించరేమో కానీ.. దాన్ని గుర్తించిన వారు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తారన్నారు. రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధిని శశిథరూర్‌ కొనియడటాన్ని రేవంత్‌ జీర్ణించుకోలేకపోయారని పేర్కొన్నారు.శశిథరూర్‌పై రేవంత్‌ చేసిన వ్యాఖ్యల ఆడియోను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తే ఓటుకు నోటు కేసులో దొరికిన ఆడియోతో ఇది కచ్చితంగా సరిపోలుతుందని వ్యాఖ్యానించారు. రేవంత్‌ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలన్నారు.

రేవంత్‌ శశిథరూర్‌ను అన్న మాటలు.. యథాతథంగా..

నేషనల్‌ మీడియా పికప్‌ కర్నేకే.. ఏ ఓ ఐటీ మినిస్టర్‌ హై.. శశిథరూర్‌ ఆరే.. అరే బేవకూఫ్‌ శశిథరూర్‌.. ఓ గధే కొ పతా హోనా హై కీ.. క్యా హో రహా.. దో చార్‌ ఇంగ్లిష్‌ మే బోల్దియేతో.. లాంగ్వేజ్‌ ఇజ్‌ నాట్‌ నాలెడ్జ్‌.. లాంగ్వేజ్‌ ఈజ్‌ ఓన్లీ కమ్యునికేషన్‌ స్కిల్‌… దో చార్‌ ఇంగ్లిష్‌ మే అచ్చా బోల్‌ దియేతో ఇంగ్లిష్‌ మే బాత్‌ కర్‌ లియేతో యహా కుచ్‌ భీ సుధర్‌నేవాలా నహీహై (ఆప్‌కూ క్యా లగ్‌తా హై సర్‌…) మేరాకో శశిథరూర్‌ గధా లగ్‌తా హై ఔర్‌ కుఛ్‌ నహీ హై.. దోనోంకా ఆటిట్యూడ్‌ సేమ్‌ హైనా..? బోలేతో యూజ్‌లెస్‌ ఫెలో.. నేను పోలేదు.. ఇసొంటోన్ని పార్టీ నుంచి ఎక్స్‌పెల్‌ (బహిష్కరణ) చేయాలె.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement