ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 15:58:34

డీఎంఈ, ఆయుష్ వైద్యులకు రిటైర్మెంట్ వయస్సు 65 ఏండ్లకు పెంచాలి

డీఎంఈ, ఆయుష్ వైద్యులకు రిటైర్మెంట్ వయస్సు 65 ఏండ్లకు పెంచాలి

హైదరాబాద్ : డీఎంఈ, ఆయుష్ వైద్యులకు పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచినట్లుగానే అవే అర్హతలు ఉన్న టీవీవీపీ వైద్యుల పదవీ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచాలి. అందుకు సహకరించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ( టీవీవీపీ ) వైద్యులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రుల అధికారిక నివాసంలో వినోద్ కుమార్ ను కలిసిన టీవీవీపీ వైద్యులు తమ సమస్యలను వివరించారు.

డీఎంఈ, ఆయుష్ వైద్యులతో సమానంగా టీవీవీపీ వైద్యులు కూడా పీజీ వైద్య విద్యార్థులకు బోధిస్తున్నారని వారు తెలిపారు. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులను పొందేందుకు 1986లో అసెంబ్లీ తీర్మానం ద్వారా చట్టంలోని 29వ అధికరణంతో ఏపీవీవీపీ ఏర్పడిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీవీవీపీగా మారిందన్నారు. ప్రస్తుతం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే టీవీవీపీ కార్యకలాపాలు సాగిస్తోందని వారు వెల్లడించారు.

ఈ విషయంపై స్పందించిన వినోద్ కుమార్ టీవీవీపీ వైద్యుల విజ్ఞప్తి న్యాయ సమ్మతంగానే ఉందన్నారు. ఈ మేరకు కేసీఆర్  కు మంగళవారం లేఖ రాశారు.  అనుభవజ్ఞులైన టీవీవీపీ వైద్యుల సేవలను మరింత కాలం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.


logo