శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 17:02:34

రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి

రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌దవిలో పార్థ‌సార‌థి మూడేళ్ల‌ పాటు కొన‌సాగనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డిని నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం ఇప్పుడు పార్థ‌సార‌థిని నియ‌మించింది. 


logo