బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:39

పొదుపు మంత్రం

పొదుపు మంత్రం

  • కూడు, గుడ్డ చాలు.. వృథా ఖర్చు తగ్గిద్దాం  
  • నగా నట్ర వద్దే వద్దు.. రెస్టారెంట్ల ఊసొద్దు
  • కిరాణా దుకాణాలు, ఆన్‌లైన్‌ షాపింగే బెటర్‌   
  • ఇతర వస్తువుల కొనుగోళ్లపై ప్రజల అనాసక్తి
  • రిటైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సర్వేలో వెల్లడి   

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వారమంతా పని.. వీకెండ్‌లో రెస్టారెంట్‌కో, విహారానికో, సినిమాలకో వెళ్లడం.. వచ్చిన వేతనంలో కొంత మొత్తం దాచుకోవడమో, ఏదో ఓ వస్తువు కొనడం.. నిన్నామొన్నటిదాకా సాగిన తంతు ఇది. కరోనా దెబ్బతో ఆ ప్రపంచం ఇప్పుడు చెల్లాచెదురైపోయింది. ఆశల మేడలు కూలిపోయాయి. ఆదాయం తగ్గడంతో ప్రజలు పొదుపు బాట పడుతున్నారు. ఉన్న సొమ్మును దుబారా చేయకుండా ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. రోజువారీ తిండికి, బట్టలకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. లగ్జరీని దూరం పెడుతున్నారు. 

లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత తొలి 15 రోజుల్లో వినియోగదారులు ఆసక్తి చూపిన వస్తువులు, కొనుగోలు చేసినవి తదితర అంశాలపై రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(రాయ్‌) లిట్మస్‌ వరల్డ్‌ అనే సంస్థతో కలిసి దేశవ్యాప్త సర్వేను నిర్వహించింది. 4239 మంది పాల్గొన్న ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఇప్పుడు రిటైల్‌, షాపింగ్‌మాల్స్‌ వైపు చూడ్డానికే ఇష్టపడటం లేదు. చుట్టపక్కల ఉన్న షాపులు, కిరాణా దుకాణాల వద్దనే సామగ్రిని, నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కొవిడ్‌-19కు ముందు కళకళలాడిన మాల్స్‌ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తొలి 15 రోజుల్లో మాల్స్‌లో 77శాతం, ఉన్నతశ్రేణి రిటైల్స్‌లో 61శాతం అమ్మకాలు తగ్గాయి. logo