మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 15:18:09

గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు

గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు

హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు విధించారు. గాంధీలోకి మీడియాకు అనుమతి లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న మీడియా వాహనాలను తక్షణమే తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. అనుమతి లేనిదే జర్నలిస్టులు లోపలికి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అక్కడ వైద్యులు, పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  logo