పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేయాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్ : పత్తి కొనుగోళ్లపై సీసీఐ ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆంక్షలు ఎత్తివేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీసీఐ సీఎండీకి లేఖ రాశారు. పత్తి కోనుగోలుకు పరిమితి విధిస్తే రైతులు ఇబ్బంది పడే అవకాశముందని, రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని పరిమితిని ఎత్తివేయాలని కోరారు.
కొనుగోళ్లపై పరిమితి నిర్దేశించడం సరికాదని, జనవరి నెలాఖరు వరకు ఆంక్షలన్నీంటిని ఎత్తివేయాలని సూచించారు. పంట చేతికొచ్చే సమయంలో ఆంక్షలు విధించడంతో రైతులు మద్దతు ధర దక్కదనే ఆందోళనకు లోనవుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కేవలం 100 నుంచి 800 బేళ్లకు మించి కొనుగోలు చేసేది లేదని సీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరలోనూ రూ. 100 కోత విధించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సమస్యలు పరిష్కరిస్తా : జడ్పీ చైర్మన్
- అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
- సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- ‘బాలికలు అద్భుతాలు సృష్టించాలి’
- బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
- ‘గంగదేవిపల్లిలా తీర్చిదిద్దుతాం’
- క్షీరగిరి క్షేత్రంలో భక్తుల పూజలు
- క్రీడలతో పెరుగనున్న స్నేహభావం
- రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించిన ముత్తిరెడ్డి
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : కలెక్టర్